హైదరాబాద్ : ఇబ్రహీంపట్నం మండలం మంగళ్‌పల్లిలో శుక్రవారం రోజున లాజిస్టిక్ హబ్ (వస్తు నిల్వ కేంద్రం)ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దాదాపు 60 శాతం పనులు పూర్తయిన నేపథ్యంలో కమర్షియల్ ఆపరేషన్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 'ఇబ్రహీంపట్నం ప్రస్తుతం అభివృద్ధి దిశగా దూసుకుపోతున్నది. హైదరాబాద్ శివారులో విస్తరించడం, ఔటర్ రింగ్‌రోడ్, అనేక కార్పొరేట్ కంపెనీలు ఇక్కడే ఇక్కడే ఏర్పడుతుండడంతో ఈ ప్రాంతం అన్ని రంగాల్లో శరవేగంగా విస్తరిస్తున్నది. 22 ఎకరాల విస్తీర్ణంలో రూ.20 కోట్ల వ్యయంతో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో దేశంలో మొదటి పార్క్‌గా దీన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నాం. త్వరలోనే బాట సింగారంలో మరో లాజిస్టిక్ పార్క్ ప్రారంభం కానుంది. ఎలిమినేడులో ఏరో స్పేస్ ప్రాజెక్ట్ రానుంది.
లాజిస్టిక్ హబ్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్